Header Banner

మదర్స్‌ డే స్పెషల్‌.. మా అమ్మే నా సూపర్‌స్టార్‌.. అందరూ ఇలా చేయండి లోకేష్ కీలక విజ్ఞప్తి!

  Sun May 11, 2025 11:53        Politics

సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు. ఆమె ప్రేమకు మించిన ఆనందం ఉండదు. అందుకే ‘మాతృదేవోభవ...’ (Maatrudevo Bhava) అని ఆమెకే తొలి ప్రణామం చేస్తారెవరైనా. ఆదివారం ‘మదర్స్‌ డే’ (Mothers Day) సందర్భంగా... మంత్రి లోకేష్ (Minister Lokesh) సోషల్ మీడియా (Social Media) వేదికగా ట్విట్ (Tweet) చేశారు. ‘‘నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. నడిపించిందీ, నడత నేర్పిందీ అమ్మే. ఓడినా, గెలిచినా వెంట నిలిచిందీ అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతీబిడ్డకు నిత్యస్ఫూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమ మూర్తీభవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నాను’’ అంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం.. నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సైతం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం.

 

ఇది కూడా చదవండి: మధుసూదన్ కుటుంబానికి జనసేన రూ.50 లక్షలు ఆర్థిక సాయం! కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..

 

ఈ రోజు మాతృ దినోత్సవం. అమ్మకు ప్రత్యేక అనుభూతిని పంచడంతో పాటు తన జీవితానికి ఆర్థిక భద్రత కల్పించే బహుమతి అందించేందుకు సరైన సందర్భమిది. అందుకు మీ ముందున్న అవకాశాలు.. మీకు వీలైనంత సొమ్మును మీ మాతృమూర్తి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేయండి. ఆ ఎఫ్‌డీ పత్రాన్ని ఈ ప్రత్యేక రోజున బహుమతిగా అందించండి. తద్వారా తనకు ఆర్థిక భరోసా కల్పించండి. ఒకవేళ మీ అమ్మ గారు 60 ఏళ్ల పైబడిన వారైతే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)లో సొమ్ము డిపాజిట్‌ చేయడం ఉత్తమం. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్‌ పథకాలపై అధిక వడ్డీతో పాటు పన్ను రాయితీ లభిస్తుంది. కాగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను మురళీ నాయక్ అంత్యక్రియల్లో మంత్రి పాల్గొననున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting